9, ఆగస్టు 2011, మంగళవారం

అభివృద్ధి - మందబుద్ధి

వాషింగ్ మెషిన్ లో బట్టలు మాత్రమే ఉతకవలెను, మీ పిల్లలను కాదు. కాఫీ వేడిగా ఉన్నది, చేతులు కాలును. ఫినాయిల్ దొడ్లు కడగటానికే, దానిని త్రాగరాదు. ఇది ప్లాస్టిక్ కవరు మాత్రమే, బొమ్మ కాదు. దీనిని తింటే గొంతుకు అడ్డం పడుతుంది.

ఇలాంటి హెచ్చరికలు చూసినప్పుడు నాకు కూడా ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదించాలనిపిస్తుంది.

"దేశం అభివృద్ధి చెందినకొద్దీ ప్రజలు మందబుద్దులు అగుదురు"

1 కామెంట్‌:

  1. విజ్ఞులకు మదీయ సందేహం
    జిరాఫీ నిటారుగా తల పైకి ఎత్తడం వలన దాని తల బాగా సాగిందని, బాతు నీటిలో ఈదడం వలన పాదాలకు చర్మాంగాలు వచ్చాయని,పాము ప్రాకటం వలన తనకు ఉండే కాళ్ళు కాలక్రమేన మాసి పోయావని పూజ్య గురువు గారు చిన్న తరగతిలో చెప్పియున్నారు. అటువంటప్పుడు మానవునిలో అవశేషావయవాలు పోకుండా ఎందుకు ఉన్నవో సందేహముగా యున్నది. మానవుడు కోతినుండి ఆవిర్భావం చెందలేదు అని అనడానికి మన ఇతిహాస గ్రంధాలను పరికించిన పిమ్మట అవగతమవగలదని నాయొక్క విన్నపములు .చివరిగా నాదొక విన్నపము మన శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి చెందక మునుపే మన ప్రాచీన ఋషులు చాలా విషయాలను దర్శించి చెప్పినవి ఎన్నో విషయలు సత్యములైనవి. డార్విన్ సిద్ధాంతము అనువాదములోనో లేక దానిని మూలాన్ని అర్ధం చేసుకోవడములోనో ఎక్కడో చిన్న పొరబాటు దొర్లి ఉంటుందన్నది నాయొక్క సందేశం చిత్తగించవలెను- బొంగి శ్రీధర్

    రిప్లయితొలగించండి