16, ఆగస్టు 2013, శుక్రవారం

పేదరికం

నిన్నటి ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో రెండు అంశాలను కలిపి చూస్తే నాకొక పెద్ద సందేహం కలిగింది. మన రాష్ట్ర జనాభా ఎనిమిదిన్నర కోట్లు. అందులో ఏడున్నర కోట్ల మందికి ఒక రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామంటున్నారు. మరో పక్క మన రాష్ట్రంలో పేదరికం బాగా తగ్గిపోయిందని, కేవలం తొమ్మిది శాతమే పేదలున్నారని అన్నారు. ఇందులో ఎక్కడో లెక్క సరిపోవట్లేదని అనిపిస్తోంది కదూ?

8, ఆగస్టు 2013, గురువారం

ఆంధ్ర రాష్ట్రం

ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ అనే అచ్చ తెలుగు పేర్లున్న రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్ర ప్రదేశ్ అనే హిందీ పేరు పెట్టేసారు ఆనాటి ఢిల్లీ పలకులు. మరిప్పుడు తెలంగాణాను మళ్లీ విడగొట్టాలని నిర్ణయించిన వారు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రం అనే తెలుగు పేరును పునరుద్ధరిస్తారా?

అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి పేరు మార్చి ఏ పి.వి. నరసింహారావు పేరో పెట్టే ధైర్యం ఈ నాటి తెలంగాణ వీరులు చేయగలరా?