9, ఆగస్టు 2011, మంగళవారం

ఫెడెక్స్ - తపాలా

నా చిన్నప్పుడు మన తపాలా శాఖ గురించి ఒక తమాషా విషయం చెప్పే వారు. ఏదైనా ఒక చిన్న ఊరిలో ఉండే తపాలా శాఖ వారి వాహనానికి చిన్న మరమ్మత్తు చేయించవలసి వస్తే ఆ 5 -10 రూపాయలు ఖర్చు పెట్టే అధికారం వారికి ఉండదట. దాని కోసం జిల్లా లేదా రాష్ట్ర ముఖ్య కార్యాలయానికి లేఖ వ్రాసి అనుమతి తెచ్చుకోవాలిట. కానీ అంతవరకూ వారు ఎంత ఖర్చైనా పెట్టి ఒక అద్దె వాహనాన్ని వాడుకోవచ్చుట. ఈ తెలివి మాలిన దుబారా ఖర్చు ఒక్క మన ప్రభుత్వానికే పరిమితమనే భ్రమలో ఉండేవాడిని.

నా భ్రమలు పటాపంచలు చేస్తూ నిన్ననే నాకో విషయం తెలిసింది. నా సహోద్యోగి ఒకరు అంతర్జాలంలో ఏదో వస్తువు కొన్నారు. అది న్యూయార్క్ నగరంలోనే ఒక చోటి నుండి ఇంకొక చోటికి చేర్చవలసి ఉంది. ఉచితంగా వస్తుందని అతను 5 రోజులలో చేర్చే సేవను ఎంచుకున్నాడు. తీరా ఆ ఫెడెక్స్ వాడు అన్ని రోజులు దానిని తన దగ్గరే ఎందుకు ఉంచుకోవాలనుకున్నాడో ఏమో దానిని న్యూయార్క్ నుండి న్యుజెర్సికి అక్కడి నుండి విమానంలో టెన్నిసీకి తిరిగి మళ్లీ విమానంలో న్యుజెర్సి ద్వారా న్యూయార్క్ కి తెచ్చి అయిదవ రోజున ఇతనికి ఇచ్చాడు.

3 కామెంట్‌లు:

  1. prasad gaaru mee telugu paandithyaniki maa lal salaam naaku ee dhiguva cheppina padhalaki koddhiga telugu tharjama cheppandi dhayachesi:
    -Belt
    -Bank
    -coffee
    -Plug
    -Apple
    prasthuthaaniki ivvi cheppandi tharvaatha migathayi choodham.

    రిప్లయితొలగించండి
  2. మీ అభిమానానికి ధన్యవాదాలు. సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కి ఏదో సరదాగా నేను పెట్టుకున్న పేరుకి మీరు నన్ను పండితుడనని వీర తాళ్ళు వేసేస్తే కష్టం. మీ పేరు వ్రాసి ఉంటే బాగుండేది. 

    ఇక మీరడిగిన పదాలకి వస్తే:
    బెల్ట్ ను తోలు పట్టీ లేదా మొల పట్టీ అనవచ్చు. మన సాంప్రదాయ వస్త్ర ధారణను బట్టి చూస్తే బెల్ట్ కు సరయిన పదం వడ్డాణం లేదా మొల త్రాడు. 
    బ్యాంకును వడ్డీ వ్యాపార సంస్థ అనవచ్చేమో. ఖచ్చితంగా అనువదిస్తే అది ఫైనాన్షియల్ ఇంష్టిట్యూషణ్ అవుతుంది. 
    ఇక మా చిన్నప్పుడు కాఫీని కషాయం అనేవాళ్ళం. 
    ప్లగ్గును బహుశ విద్యున్నాశిక అనవచ్చేమో. ముక్కులో గాలి ఆడినంతసేపు మనలో జీవం ఎలా ఉంటుందో ప్లగ్గులోవిద్యుత్ ఉన్నంతసేపు పరికరాలలో జీవం అలా ఉంటుంది. పైగా దానికి కూడా మన ముక్కు లాగే రెండు రంధ్రాలు. 
    ఇక ఆపిల్ ను కాశ్మీరఫలం అంటారు. డాక్టర్ని దూరంగా ఉంచుతుందంటారు కాబట్టి సరదాగా వైద్య దూర ఫలం అనవచ్చేమో. :-)  

    రిప్లయితొలగించండి