19, ఏప్రిల్ 2012, గురువారం

మేఘ మందసం

మొన్న ఒక సమావేశంలో cloud computing గురించి మాట్లాడుకుంటూ మన సమాచారాన్నంతా మేఘాలలో దాచుకోవటం, తిరిగి ఎక్కడినుంచైనా దానిని పొందగలగటం వంటి విషయాలు వింటున్నపుడు చిన్నప్పుడు విన్న తమాషా కథ ఒకటి గుర్తుకు వచ్చింది.

ఒకప్పుడు ఆకాశం చాలా తక్కువ ఎత్తులో ఉండేదిట. ప్రజలందరూ తమ డబ్బుని, ఇంకా విలువైన ఇతర వస్తువులని అటక మీద దాచుకున్నట్టు మబ్బుల పైన దాచుకునే వారుట. ఒకసారి ఒక పెద్ద దొంగల ముఠా ఆ సంపదనంతా దోచుకోవాలని వస్తే, ఆ విషయం తెలుసుకున్న ప్రజలు రాళ్ళతో కొట్టి కొట్టి ఆకాశాన్ని పైకి పంపేసారుట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి