3, నవంబర్ 2011, గురువారం

చిట్టి డైరక్టర్

ఆ మధ్యన ఒక రోజు మా అమ్మాయిని బయట లాన్లో ఆడిస్తున్నాను. ఉన్నట్టుండి నాన్నా నీకో కథ చెప్పనా అంది. సరే చెప్పమంటే ఇలా చెప్పింది:

"అనగనగా ఒక చిన్న జిరాఫీ పిల్ల ఉంది. దానికి ఒకసారి చాలా ఆకలి వేసి చెట్టు నుంచి చాలా పళ్ళు కోసుకుని తినేసింది. అప్పుడు దాని పొట్ట పెద్దగా అయిపోయింది. అది ఇంటికి  వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకి నమస్కారం పెడదామంటే పొట్ట పెద్దదవటం వల్ల కుదరటం లేదు. చాలా కష్టపడి పెట్టింది కానీ ఇంతలో దాని పొట్ట పగిలిపోయి అందులోంచి పళ్లన్నీ కింద దొర్లిపోయాయి. అప్పుడు వాళ్ళ నాన్న జిరాఫీ ఒక పాముని తెచ్చి దాని పొట్టకి బెల్టు లాగా పెట్టి కుట్టేసాడు."

ఎప్పుడో ఆరు నెలల క్రితం చెప్పిన వినాయకుడి కథను అది అంత బాగా గుర్తు పెట్టుకున్నందుకు సంతోషించాలో లేక దేవుళ్ళ పాత్రలను జిరాఫీలుగా మార్చేసినందుకు ఏడవాలో తెలియలేదు. బహుశా ఇలాంటివాళ్ళే పెద్దయ్యాక తెలుగు సినిమా దర్శకులు అవుతారేమో.

3 కామెంట్‌లు:

  1. నేను మా అమ్మాయికి యూ టుబ్ లొ నందిగుప్తుడు ధనగుప్టుడు కద చూపించాను.కొన్ని రొజుల తరువాత కద చెప్పమంటె అదె కద మొదలు పెట్టాను.కాని పెర్లు మర్చిపొయాను.వెరె పెర్లతొ చెబుతుంటె..మా అమ్మాయి అది నందిగుప్తుడు కద అని అరిచింది.

    రిప్లయితొలగించండి
  2. ఎంచక్కా బావుంది కదండీ మీ పాప చెప్పిన కథ క్యూట్ గా.. :))

    రిప్లయితొలగించండి
  3. బావుంది జిరాఫీ గా మార్చి మీ పాప చెప్పిన కథ. "చిట్టి" ఎప్పుడో గొప్ప డైరెక్టర్ అవుతుంది. మా "చిట్టి" కి పోటీ రాకండోయ్! ;)

    రిప్లయితొలగించండి