ఇటీవల మా ఆవిడ కాన్పు కోసమై వైద్యశాలకు వెళ్ళాం. అది మరీ ప్రొద్దున్నే కావడంతో ఎమర్జెన్సి అని పిలువబడే అతి నెమ్మదిగా పని జరిగే విభాగం ద్వారా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ షరా మాములుగా నీ పేరేమిటి? వయసెంత? ఇన్స్యురెన్స్ ఉందా? వంటి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పి, వాళ్ళు ఇచ్చిన ఒక కట్ట కాగితాలపై నొప్పులు పడుతూనే సంతకాలు పెట్టి (ఇక్కడ మనం ఎందుకూ పనికి రాము. అన్నీ ఆడవాళ్లు చేయవలసిందే.) ప్రసూతి వార్డుకి చేరుకునేసరికి ఒక గంట పట్టింది.
ఇక అక్కడి నర్సు ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ కాన్పు నీ భర్తకి ఇష్టమేనా? మీరిద్దరూ అన్యోన్యంగానే ఉంటారా? లేక కొట్టుకుంటారా? మీ మొదటి పాపను మీ అయన సరిగ్గానే చూస్తాడా? పుట్టబోయే బిడ్డకి తండ్రెవరు? ఇలా సవాలక్ష అసందర్భ ప్రశ్నలతో నొప్పులు పడుతున్న మా ఆవిడను వేధించి చివరికి మంచం మీద పడుకోపెట్టింది.
ఇక కాన్పు అయ్యి వేరే గది లోకి మారిన తరువాత అరగంటకొక కొత్త నర్సు రావటం, ప్రశ్నలతో ముంచెత్తటం. మీ బాబు పాలు త్రాగాడా? ఎన్ని నిముషాలకి ఒకసారి త్రాగుతున్నాడు? ఎంత త్రాగుతున్నాడు? ఎన్ని సార్లు విరేచనం అయ్యింది? ఎన్ని గంటలకు ఏ ఏ రంగులో అవుతోంది? గంటకు ఎన్ని సార్లు ఏడుస్తున్నాడు? ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు?
ఇవి కాక వచ్చిన ప్రతివాళ్ళు, ఎలా ఉన్నారు? మీ పేరేమిటి? ఎంతమంది పిల్లలు? ఇవాళ వాతావరణం బాగుంది కదా. మీకు కంగ్రాట్స్, మాకు థాంక్స్ లాంటి రొటీన్ పలకరింపులు సరే సరి. మొత్తానికి అక్కడినుంచి బయటపడే సరికి వాగి వాగి మా ఆవిడకి శోష, నాకు తలనొప్పి వచ్చి, బ్రతుకు జీవుడా అని ఇంటికి చేరాం.
hahaahah...though you wrote funnily, it is difficult to answer all those question in that time..your wife is very patient..one of my friends said that she felt like breaking the head of the nurse...hahahah...
రిప్లయితొలగించండిEnnela