నేను చెన్నైలో పని చేసే రోజుల్లో ఒకసారి మా ప్రాజెక్ట్ పూర్తయిన సందర్భంలో జరిగిన మీటింగుకి మా మానేజరు SKS అనే ఒక ఆయన్ను పిలిచి ఆయన వచ్చినందుకు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయింది. కానీ మేము అంతకు ముందు ఈ SKS అనే ఆయన్ను చూడటం కానీ ఆయన పేరు వినటం కానీ జరగలేదు.
మేము మా సీటుకి తిరిగి వచ్చాక నా మిత్రుడు నాగరాజు, నేను కలిసి ఈ SKS ఎవరో తెలుసుకుందామని outlook directory అంతా పరిశోధించి చివరికి ఆయన పూర్తి పేరు కనిపెట్టగలిగాం. ఇంతకీ ఆయన పూర్తి పేరు శ్రీనివాసన్ కన్నన్ శ్రీనివాసన్.
ఆ పేరు చదవగానే నేను ఇదేం పేరు రావు గోపాల రావు లాగా అన్నాను. అది వినగానే నా స్నేహితుడు ఎంతో ఆశ్చర్యపోయి నిజమే కదా, చిన్నపటినుంచి రావు గోపాల రావు నటించిన ఇన్ని సినిమాలు చూసాను గాని, ఇప్పుడు నువ్వు అనే దాకా అ పేరు నాకెప్పుడూ విచిత్రంగా అనిపించలేదు అన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి