చిన్నప్పుడు చదివిన జోకు:
వెంగళప్ప మొదటిసారిగా పట్నం వెళుతున్నాడు. అతని స్నేహితుడొకడు అతనికి జాగ్రత్తలు చెపుతూ పట్నంలో అన్ని ఎక్కువ ధర చెపుతారు. కాబట్టి మోసపోకుండా వాళ్ళు చెప్పిన దానికి సగం ధరకే బేరం చెయ్యి అని చెప్పాడు.
మన వెంగళప్ప ఒక గొడుగులు అమ్మే కొట్టుకు వెళ్లి ఒక గొడుగు ఎంత అని అడిగాడు. ఆ కొట్టువాడు ఒకటి 100 రూపాయలని చెప్పాడు. మనవాడికి వెంటనే స్నేహితుని హితోపదేశం గుర్తుకు వచ్చి 50కి ఇస్తావా అని అడిగాడు. అతను సరేనన్నాడు. వెంటనే మన వెంగళప్ప బుర్ర పని చేయటం మొదలుపెట్టింది. మళ్లీ సగం ధరకు అడుగుదామని అయితే 25కి ఇస్తావా అన్నాడు.
ఆ కొట్టువాడికి చిరాకు వచ్చి ఊరికే ఇస్తాను తీసుకువెళ్ళు అన్నాడు. అక్కడితో వదిలితే మనవాడు వెంగళప్ప ఎలా అవుతాడు? అందుకని ఊరికే రెండు ఇస్తావా అని అడిగాడు.
బాగుంది. ఐనా నాకో డౌటు, ఈ వెంగళప్ప పేరు ఎక్కడిదండీ. కన్నడీనా? అసలీపేరుకూ, వెర్రికీ ఏమిటో.. ఈ అవినాభావ అక్షర సంబంధం.
రిప్లయితొలగించండికావచ్చు. వెంగళప్పకీ వెర్రికి, పుల్లయ్యకి పిచ్చికి అలాగే అప్పారావుకి అప్పుకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఎన్నో తరాలనుంచి ఈ పదబంధాలు మన భాషలో ఇమిడిపోయాయి. వీటిని ఉపయోగించటం వలన ఒక సౌలభ్యం ఉంది. మనం కష్టపడి పాత్ర స్వభావాన్ని వివరించనక్కర లేకుండా కేవలం ఒక పేరు ద్వారా పాఠకుడికి అ పాత్రను పూర్తిగా పరిచయం చేయవచ్చు. ఏమైనా మీరన్నట్టు ఇది కేవలం అక్షర సంబంధమే కానీ ఎప్పటికి నిలిచి ఉండే అక్షరమైన సంబంధం.
రిప్లయితొలగించండి